విజయవాడ నగరంలోని సింగ్ నగర్ పైపుల రోడ్డు కూడలిలో ఉన్న తారా స్క్రీన్ థియేటర్లో రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ థియేటర్‌కు ఎలాంటి అనుమతులు లేని సంగతి గుర్తించిన రెవెన్యూ అధికారులు విజయవాడ నగర నార్త్ జోన్ తహశీల్దార్ వాసుదేవరావు ఆధ్వర్యంలో థియేటర్‌ను సీజ్ చేశారు. మరుగుదొడ్లు ఫైర్ ఎగ్జిట్ సినిమా ప్రదర్శనకు కావాల్సిన అనుమతులు పార్కింగ్ వంటి అనేక అంశాలు సంబంధించిన ధ్రువపత్రాలు థియేటర్ నిర్వాహకులకు లేకపోవడంతో సినిమా హాల్ సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు సినిమా హాల్‌ను తనిఖీ చేశారని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లుగా తమ పరిశీలనలో తేలడంతో థియేటర్‌కు సీలు వేశామని విజయవాడ నగర నార్త్‌జోన్ తహశీల్ధారు వాసుదేవరావు తెలిపారు.
అనుమతి పత్రాలు లేని... తారా థియేటర్ సీజ్ - అనుమతి పత్రాలు లేనందున.... తారా థియేటర్ సీజ్
విజయవాడ సింగ్ నగర్లో అనుమతి పత్రాలు లేని తారా సినిమా థియేటర్‌ను అధికారులు గుర్తించి సీజ్ చేశారు.
అనుమతి పత్రాలు లేనందున.... తారా థియేటర్ సీజ్
TAGGED:
theater seezed in vja