కృష్ణా జిల్లాలో వర్షాలు పుష్కలంగా పడ్డాయి. రైతులకు వరినాట్లు వేయడానికి అనువైన సమయం ఇది. కానీ రైతులను కూలీల బెడద ఇబ్బందులు పెడుతోంది. కరోనాతో.. ఖరీఫ్ ఆరంభంలోనే కూలీల కొరత ఏర్పడింది. ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చే పరిస్థితి లేదు. దీంతో వరి నాట్ల నుంచే రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. కూలీ ఎక్కువ ఇస్తామన్న కరోనా భయంతో.. కూలీలు ముఖం చాటేస్తున్నారు.
కరోనా కాటు.. కూలీలు లేక రైతుల పాట్లు - కరోనాతో రైతుల కష్టాలు
కృష్ణా జిల్లా అంతటా ముమ్మరంగా వర్షాలు కురుస్తున్నాయి. సేద్యానికి ఎంత మాత్రం నీటి ఇబ్బందులు లేకపోయినా సాగు ముందుకు సాగడం కష్టంగా మారుతోంది. వెదజల్లే పద్ధతిలోనే వరి పంట పండించాలని వ్యవసాయశాఖ చెబుతున్నా.. రైతులు ఏళ్ల తరబడి అవలంబిస్తున్న వరి నారుమళ్లు పెంచి- వాటిని నాటుకునే విధానాలను వదిలేందుకు ఇష్టపడడం లేదు. వానలు కలిసిరావడంతో ఎక్కువ మంది రైతులు నాట్లు వేశారు. కరోనా కారణంగా కూలీల కొరత ఇప్పుడు రైతులను ఆందోళనకు గురి చేస్తోంది.
కూలీలు లేక రైతుల పాట్లు
గతంలో వరినాట్లు వేయడానికి ఎకరాకు సుమారు రూ.4 వేలు అయ్యిందని.. ఇప్పుడు రూ.6 వేలు ఇచ్చినా కూలీలు దొరకడం కష్టంగా మారిందన్నారు. కూలీల ఖర్చు బాగా పెరిగిందని రైతులు వాపోతున్నారు. ఈసారి కూలీల లభ్యతే పెద్ద చింతగా ఉందని సాగుదారులు ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చదవండి: తండ్రి కష్టం చూడలేక.. కాడెద్దులుగా మారిన కూతుళ్లు