జిల్లాలో 144 సెక్షన్... ఉపాధి హామీ పనులకు జనం..! - corona effect in krishna district
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వాలని ప్రభుత్వం చెబుతున్నా... కొందరు ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. కృష్ణా జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉన్నా... కనీస జాగ్రత్తలు పాటించకుండా పనులకు తీసుకెళ్తున్నారని ప్రజలు చెబుతున్నారు.
కరోనా భయంతో రాష్ట్రమంతటా లాక్డౌన్ నడుస్తోంది. కృష్ణా జిల్లాలో 144 సెక్షన్ విధించారు. మోపిదేవి గ్రామ శివారు బోడకుంట ప్రజలు లాక్డౌన్కు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సుమారు మూడు వందల మంది ఉపాధి హామీ పనికి వెళ్లారు. ప్రభుత్వ స్థలాల కోసం సేకరించిన భూమిలో రోడ్ల నిర్మాణం కోసం వెళుతున్నారు. మాస్కులు ధరించాలి, ఎవరి మంచినీళ్లు వారే తెచ్చుకోవాలి, రెండు మీటర్ల దూరం పాటించాలి అనే నిబంధనలు అమల్లో ఉన్నా... నిర్వాహకులు ఇవన్నీ పట్టించుకోకుండా పనులకు తీసుకెళ్తున్నారు. ఫలితంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.