'అఫిడవిట్లో జగన్ పూర్తి ఆస్తులు వెల్లడించలేదు' - kutumbarao
వైఎస్ జగన్, భారతి ఆస్తుల విలువ 5 వేల 361 కోట్ల 80 లక్షలు. కానీ ఎన్నికల అఫిడవిట్లో జగన్ పేర్కొన్న ఆస్తుల విలువ కేవలం 499 కోట్ల 33 లక్షలు మాత్రమే: కుటుంబరావు
జగన్ తన ఆస్తుల పూర్తి వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనలేదని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆరోపించారు. ప్రతిపక్ష నేత అఫిడవిట్లో చెప్పని ఆస్తుల విలువ 4862 కోట్ల రూపాయలు ఉంటుందని అమరావతిలోని తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. వాస్తవాలు దాచిపెట్టి ప్రజలను మాయ చేసేందుకు వైకాపా అధినేత ప్రయత్నించారని విమర్శించారు. విజయవాడ వైకాపా ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ కంపెనీలో షేర్లు కొనుగోలు చేసిన వారు నష్టపోయారన్నారు. ఆర్థిక నేరగాళ్లను కాపాడేందుకు విజయసాయిరెడ్డి ఉన్నారని జగన్ చెబుతున్నారని దుయ్యబట్టారు. జగన్ ఆస్తులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని... తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశముందని తెలిపారు.