తెదేపా అధినేత కాన్వాయ్ పైకి చెప్పులు, గుడ్లతో ఎలా దాడి చేశారని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం తన నాశనాన్ని శాసనంగా రాసుకుంటోందని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం ప్రజల్లో అపఖ్యాతిని మూటగట్టుకుందని అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, 151 సెక్షన్ కింద చంద్రబాబు నాయుడిపై కేసులు పెట్టారన్నారు. చంద్రబాబుపై కేసులు పెట్టడాన్ని హైకోర్టు తీవ్ర పరిణామంగా పరిగణించిందని గుర్తు చేశారు.
నాశనానికి శాసనం రాసుకుంటున్నారు: మాజీ మంత్రి కేఎస్ జవహర్ - వైకాపా ప్రభుత్వంపై మండిపడిన మాజీ మంత్రి కేఎస్ జవహర్
విశాఖ విమానాశ్రయం వద్ద చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్రను అడ్డుకునేందుకు మూడు వందలకు పైగా వైకాపా కార్యకర్తలు ఎలా వచ్చారని మాజీ మంత్రి కేఎస్ జవహర్ నిలదీశారు.
వైకాపా ప్రభుత్వంపై మండిపడిన మాజీ మంత్రి కేఎస్ జవహర్