స్వచ్ఛ చల్లపల్లి స్ఫూర్తి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయితీల్లో కొనసాగిస్తే జిల్లాను స్వచ్ఛ సుందర కృష్ణాజిల్లాగా తీర్చిదిద్దుకోవచ్చని కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమాలు చూసేందుకు మంగళవారం జిల్లా కలెక్టర్ చల్లపల్లి వచ్చారు. తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి స్వచ్ఛ చల్లపల్లి సారథులు డాక్టర్ డీఆర్కే ప్రసాద్, పద్మావతిలతో మాట్లాడారు. 1666 రోజులుగా చల్లపల్లిలో జరుగుతున్న స్వచ్ఛ సేవా కార్యక్రమాలను డీఆర్కే ప్రసాద్ కలెక్టర్ కు వివరించారు. గ్రామ స్వచ్ఛతకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. గ్రామంలో రహదారి వనాలను, స్వచ్ఛ కార్యకర్తలచే అభివృద్ధి చేసిన ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు.
గ్రామాలన్నీ చల్లపల్లిని స్ఫూర్తిగా తీసుకోవాలి: కలెక్టర్ - స్వచ్ఛ చల్లపల్లి స్ఫూర్తి అన్ని గ్రామాల్లో రావాలి:కలెక్టర్
కృష్ణా జిల్లా చల్లపల్లిలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పర్యటించారు. గ్రామంలో స్వచ్ఛ చల్లపల్లి పేరుతో చేస్తున్న కార్యక్రమాలను పరిశీలించారు. చల్లపల్లి స్ఫూర్తి జిల్లాలోని అన్ని గ్రామాల్లో రావాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

స్వచ్ఛ చల్లపల్లి స్ఫూర్తి అన్ని గ్రామాల్లో రావాలి:కలెక్టర్
చల్లపల్లి స్పూర్తి జిల్లా అంతా రావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. మనిషికి ఆరోగ్యం.. పరిశుభ్రత రెండు చేతులు వంటివని అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ప్రతి ఒక్కరూ చేతిసంచి వాడటం అలవాటు చేసుకోవాలని సూచించారు.