ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.. లోపాలపై ఫైర్' - koduru talsildar office

కృష్ణాజిల్లా కోడూరు మండలంలోని పీహెచ్ సీ, తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ నివాస్ సేవల్లోని లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులకు పాస్ పుస్తకాల జారీలో ఆలస్యంపై నివేదిక కోరారు.

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

By

Published : Aug 26, 2021, 9:34 PM IST


వేలాది మంది రోగులు వచ్చే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరుగుదొడ్ల నిర్వహణ సరిగాలేకపోవడంపై జిల్లా కలెక్టర్ నివాస్ కృష్ణాజిల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలోని కోడూరు పీహెచ్ సీ తనిఖీలో వైద్య అధికారులపై మండిపడ్డారు. ఆస్పత్రిని నాడు - నేడు పథకం కింద అభివృద్ధి చేసినా.. మరుగుదొడ్లకు కనీసం మరమ్మతులు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

వైద్యశాలలో ప్రసవాలు లేకపోవటంపై ప్రశ్నించారు. ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసి వసతులు కల్పిస్తూ ఉంటే.. ప్రసవాల సంఖ్య ఎందుకు పెరగడం లేదని ప్రశ్నించారు. సెప్టెంబర్ నెలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 40 మంది గర్భిణులకు ప్రసవం జరగనున్నట్లు రిజిస్టర్ లో గమనించిన కలెక్టర్.. వాటిలో కనీసం 10 కోడూరు ఆస్పత్రిలోనే జరిగేలా చూడాలని ఆదేశించారు. రెండు నెలల్లో మళ్లీ ఆసుపత్రి తనిఖీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

కోడూరు తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టిన కలెక్టర్.. వీఆర్వోల పనితీరును పరిశీలించారు. పాస్ పుస్తకాల జారీ విషయంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని వీఆర్వోలను ప్రశ్నించారు. జాప్యంపై కలెక్టర్ నివాస్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. దీనిపై నివేదిక అందించాలని ఆర్డీఓ ఖాజావలిని ఆదేశించారు.

ఇదీ చదవండి:

PEDDIREDDY: గృహనిర్మాణ పనులపై మంత్రి పెద్ది రెడ్డి సమీక్ష

ABOUT THE AUTHOR

...view details