కరోనాకు మందు తయారు చేసి వార్తల్లో నిలిచిన కృష్ణపట్నం వాసి ఆనందయ్యను విజయవాడలో పట్టణ సెంట్రల్ నియోజకవర్గం సీపీఐ నాయకులు ఘనంగా సన్మానించారు. స్థానికులకు ఆనందయ్య మందును పంపిణీ చేశారు. కరోనా మూడోదశను సమర్థంగా అడ్డుకునేందుకు.. ముందస్తుగానే ప్రకృతిసిద్ధ మందును తయారు చేస్తున్నామని ఆనందయ్య తెలిపారు. కరోనా మహమ్మారి కి ఆయుర్వేదం పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు.
ధనార్జన కోసం కొందరు నకిలీ మందును తయారు చేసి తన పేరుతో విక్రయిస్తున్నారని, అలాంటి వాటికి దూరంగా ఉండాలని ఆనందయ్య కోరారు. మనోధైర్యంతో కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలని సూచించారు. పురాతనమైన ఆయుర్వేద వైద్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందించాలని విజ్ఞప్తి చేశారు.