విధినిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ చూపే సిబ్బందికి శాఖాపరంగా అవసరమైన సంపూర్ణ సహకారం అందిస్తామని కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ చెప్పారు. దర్యాప్తులో భాగంగా ప్రత్యేక ప్రతిభ చాటిన సిబ్బందికి ప్రతివారం ఇచ్చే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డులకు ఇద్దరు కానిస్టేబుళ్లు ఎంపికయ్యారు. గంజాయి రవాణాకు సంబంధించి నిందితులను పట్టుకునే క్రమంలో కంచికచర్ల స్టేషన్‌కు సంబంధించిన కానిస్టేబుల్ శ్యామ్ మూడు రోజులపాటు రహస్యంగా ఏజెన్సీ ప్రాంతంలో విచారించి నిందితులను పట్టుకోవడంలో కీలక భూమిక పోషించారు. నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉండే హనుమాన్ జంక్షన్ కూడలిలో జోరున వర్షం పడుకున్నా లెక్కచేయకుండా తడుస్తూనే నాలుగు గంటలపాటు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆది బాబు విధినిర్వహణలో పాలుపంచుకున్నారు. వీరిద్దరి సేవలను గుర్తించిన ఎస్పి జిల్లా పోలీసు కార్యాలయంలో వారికి ప్రశంసా పత్రాలతో పాటు నగదు రివార్డు అందజేశారు.
ఇద్దరు కానిస్టేబుళ్లకు రివార్డు.. ఇంతకీ వారేం చేశారంటే? - కృష్ణా జిల్లా తాజా వార్తలు
విధి నిర్వహణలో ఉత్తమ ప్రదర్శన చూపిన ఇద్దరు కానిస్టేబుళ్లకు కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ప్రశంసా పత్రంతో పాటు నగదు రివార్డు అందజేశారు. విధి నిర్వహణలో ప్రతిభ చూపే సిబ్బందికి సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు.
ఇద్దరు కానిస్టేబుల్స్‌కు రివార్డు.. ఇంతకీ వారేం చేశారంటే?