సమస్యల పరిష్కారానికి జూమ్ యాప్ - ఎస్పీ
స్పందన కార్యక్రమంలో చేసే ప్రతి ఫిర్యాదుకు సత్వరం న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. జూమ్ యాప్ ద్వారా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు.

krishna_sp_launched_jam_app_for_spandana_problems_solution
సమస్యల పరిష్కారానికి జామ్ యాప్
కృష్ణా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో తొలిసారిగా జూమ్ యాప్ ద్వారా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. బాధితులు చేసే ఫిర్యాదులపై ఈ యాప్ ద్వారా సంబంధిత పోలీస్ అధికారులతో ముఖాముఖి మాట్లాడి పరిష్కార చర్యలకు ఆదేశాలు జారీచేశారు. ఈ యాప్ ఉపయోగించుకుని ఆయా శాఖల నుంచి నేరుగా ఎస్పీకి బాధితులు ఫిర్యాదులు చేసేలా సౌకర్యం కల్పించారు.