రాష్ట్ర సరిహద్దులోని ముక్త్యాల వద్ద వరద గంటగంటకి క్రమంగా పెరుగుతోంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి 4.5 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదం చేస్తున్నారు. దీంతో నదిలో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. వరద ప్రవాహం పెరగడం కారణంగా... పలుచోట్ల రక్షిత నీటి పథకాల నిర్మాణాలు నీట మునిగాయి. ఇక్కడి ప్రజలు వరద ఇబ్బందులు పడకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ముక్త్యాల వద్ద క్రమంగా పెరుగుతున్న వరద - Krishna river floods
కృష్ణాజిల్లా ముక్త్యాల వద్ద వరద క్రమంగా పెరుగుతోంది. పులిచింతల నుంచి భారీగా ప్రవాహం రావడం కారణంగా... పలుచోట్ల రక్షిత నీటి పథకాల నిర్మాణాలు నీట మునిగాయి.
ముక్త్యాల వద్ద క్రమంగా పెరుగుతున్న వరద