కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ అయింది. హైదరాబాద్ జలసౌధలో జరుగుతున్న ఈ సమావేశానికి బోర్డు సభ్యకార్యదర్శి రాయిపురే, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి హాజరయ్యారు. మార్చి నెలాఖరు వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు, విడుదలపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు భేటీలో నిర్ణయం తీసుకోనుంది.
మార్చి నెలాఖరు వరకు తాగు, సాగునీటి అవసరాలను కావాల్సిన నీటి వివరాలను రెండు రాష్ట్రాలు ఇప్పటికే బోర్డుకు అందించాయి. 83 టీఎంసీలు కావాలని తెలంగాణ, 108 టీఎంసీలు కావాలని ఆంధ్రప్రదేశ్ కోరాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు వినియోగించుకున్న జలాలు, ప్రస్తుతం నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లో నీటి నిల్వలను దృష్టిలో ఉంచుకొని ఇరు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు, విడుదలపై సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.