ప్రతి పోలీసు యూనిట్‌కు ఒక ప్రత్యేక చిహ్నం ఉంటుంది. ఆ యూనిట్ పరిధిలోని విశేషాలు, ప్రత్యేకతల ఆధారంగా దీనిని రూపొందిస్తారు. ఆ చిహ్నంను ప్రతి పోలీసు యూనిఫారంపై విధిగా ధరించాలి. కృష్ణా పోలీసు యూనిట్ చిహ్నంను మారుస్తున్నట్లు సమాచారం. దీనిపై కృష్ణా ఎస్పీ సిద్ధార్డ్ కౌశల్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. జిల్లా చరిత్ర, ప్రత్యేకతలను బట్టి వివిధ డిజైన్లను సిద్ధం చేయిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న చిహ్నం కొల్లేరు సరస్సును ప్రతిబింబిస్తోంది. ఇందులో పడవ, కొల్లేటి కొంగ చిహ్నాలు ఉన్నాయి. కొల్లేరు సరస్సు.. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య ఉన్నందున, లోగో మార్చాలన్న ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. ప్రత్యేకంగా కృష్ణా జిల్లా విశిష్టతలు తెలిపేలా ఉండాలన్న ఆలోచనతో కొత్త దానిపై దృష్టి పెట్టారు. ఎస్పీ ఇచ్చిన పిలుపునకు స్పందించి, పలువురి నుంచి కొత్తవి 12 వరకు చేరాయి. వీటిని వడపోసి, చివరకు కొన్నింటిని ఎంపిక చేశారు. వీటిపై పోలీసుల నుంచి అభిప్రాయం కోరుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాత కూచిపూడి నృత్య భంగిమతో ఒకటి, మత్స్య సంపద, సముద్రం చిహ్నాలతో మరొకటి తుది పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీటికి సంబంధించి పలు మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉంది. వడపోత అనంతరం త్వరలో ఓ చిహ్నంను ఖరారు చేయనున్నారు. అనంతరం ఆమోదం కోసం డీజీపీ కార్యాలయానికి పంపనున్నారు.
మారనున్న కృష్ణా జిల్లా పోలీసు చిహ్నం - krishna latest news
కృష్ణా జిల్లా పోలీసు చిహ్నం మారనుంది. కొత్త డిజైన్‌కు సంబంధించి ఎస్పీ సిద్ధార్ధ్ కౌశల్ కసరత్తు చేస్తున్నారు . కాగా ప్రతి పోలీసు యూనిట్‌కు ఒక ప్రత్యేక చిహ్నం ఉంటుంది. ఆ యూనిట్ పరిధిలోని విశేషాలు, ప్రత్యేకతల ఆధారంగా దీనిని రూపొందిస్తారు. ఆ చిహ్నంను ప్రతి పోలీసు యూనిఫారంపై విధిగా ధరించాలి.
Krishna police logo change