ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సోదరుడే హంతకుడు.. రాజకీయంగా పోటీ రావడమే కారణం! - police chased murder case news

కృష్ణా జిల్లా తిరువూరు మండలం రామన్నపాలెం వద్ద వ్యక్తి హత్య కేసులో నిందితుణ్ని పోలీసులు అరెస్టు చేశారు. రాజకీయంగా తనకు పోటీ వస్తున్నాడనే అక్కసుతో సొంత సోదరుడే ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

వ్యక్తి హత్య కేసులో నిందితుడి అరెస్టు.. సోదరుడే హంతకుడు
వ్యక్తి హత్య కేసులో నిందితుడి అరెస్టు.. సోదరుడే హంతకుడు

By

Published : Jul 16, 2020, 7:53 PM IST

కృష్ణా జిల్లా తిరువూరు మండలం రామన్నపాలెం వద్ద జరిగిన వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. సోదరుడు వెంకటేశ్వరరావు హంతకుడని నిర్ధరించారు. రాజకీయంగా తనకు సమాంతరంగా ఎదుగుతున్నాడనే భావనతోనే పథకం ప్రకారం నిందితుడు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

నూజివీడు మండలం దేవరగుంటకు చెందిన తాళం రాంబాబును మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి సుత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అటుగా వస్తోన్న ఆటో డ్రైవర్ అతన్ని గమనించి​ 108కు సమాచారం ఇచ్చాడు. బాధితుణ్ని అక్కడి నుంచి తిరువూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించగా... మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలిస్తుండగా మార్గమద్యలోనే మృతి చెందాడు.

హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు విచారణలో భాగంగా సోదరుడు వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. నిందితుణ్ని కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

ఇష్టమైన కూర వండలేదని భార్యతో ఘర్షణ.. భర్త ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details