పాల సేకరణ ధరను లీటరుకు రూ.5 పెంచుతూ.. నిర్ణయం తీసుకున్నట్లు కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. కరోనా నిబంధనలను అనుసరించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం పాల సేకరణ ధర లీటరుకు రూ.65 ఉండగా, రూ.70కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు.
రైతుల సంక్షేమం కోసం పెంచిన పాల ధర.. మే 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. రెండేళ్ల కాలంలో రూ.14 పెంచామన్నారు. దేశంలో ఏ మిల్క్ డైరీ ఇవ్వని రేటును పాల రైతుల సంక్షేమం కోసం.. కృష్ణా మిల్క్ యునియన్ అందిస్తోందన్నారు.