ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ధాన్యం కొనుగోళ్లు: జేసీ - రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ధాన్యం కొనుగోళ్లు న్యూస్

కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై రైస్ మిల్లర్లతో జేసీ మాధవీ లత సమీక్ష నిర్వహించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేస్తామని ఆమె స్పష్టం చేశారు.

రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ధాన్యం కొనుగోళ్లు
రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ధాన్యం కొనుగోళ్లు

By

Published : May 22, 2021, 11:41 AM IST

రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేస్తామని కృష్ణా జిల్లా జేసీ మాధవీలత అన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై రైస్ మిల్లర్లతో ఆమె సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లపై అనుసరించాల్సిన విధానాలను రైస్ మిల్లర్లకు వివరించారు. రబీలో పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా, జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేస్తామని జేసీ స్పష్టం చేశారు.

ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీను కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్ రావు, రైస్​మిల్లర్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details