కృష్ణా నదికి వస్తున్న వరదతో విజయవాడలోని రామలింగేశ్వర నగర్, గాంధీ కాలనీ, సాయిరాం కట్ పీసెస్ రోడ్డు, భూపేష్ గుప్తా నగర్ ప్రాంతాల్లో వరద నీరు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరింది. రెవెన్యూ అధికారులు, విపత్తు నిర్వాహక బృందాలు స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించారు. రామలింగేశ్వర నగర్లోని కమ్యూనిటీ హాలు, పటమటలంకలోని నగర పాలక సంస్థ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పునరావాసం కల్పించారు. వరద బాధితులకు తాగునీరు, భోజనం ఏర్పాట్లను విజయవాడ అర్బన్ మండలం తహసీల్దార్ లాలితాంజలి పర్యవేక్షిస్తున్నారు. పసిపిల్లలకు పాలు అందిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో వైద్య సిబ్బందిని, మందులను అందుబాటులో ఉంచారు.
పునరావాస కేంద్రాలకు ముంపు బాధితులు - krishna river
కృష్ణా నదికి వస్తున్న వరదతో విజయవాడ లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. బాధితులను అధికారులు శిబిరాలకు తరలిస్తున్నారు.
వరద ముంపు