ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ వరద ఉద్ధృతి పెరగుతోంది. సుమారు 8 లక్షల 21 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు. అధికారులను, సహాయక బృందాలను విపత్తు నిర్వహాకశాఖ సిద్ధంగా ఉంచింది. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. వరద నీటిలో ఎవరూ ఈతకు, స్నానాలకు వెళ్లరాదని హెచ్చరిస్తున్నారు. వరద ప్రవాహంలో బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లుతో నదిలో ప్రయాణించవద్దంటూ అప్రమత్తం చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
పులిచింతల వద్ద ఉద్ధృతంగా కృష్ణా ప్రవాహం
పులిచింతల జలాశయం వద్ద కృష్ణా నది వరద ప్రవాహం ఉద్ధృతంగా మారింది. సుమారు 7లక్షల 77 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 7లక్షల 53 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 22 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా.. ప్రస్తుతం 168.93 అడుగులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 38.68 టీఎంసీలు నిల్వఉంది.
మోపిదేవి మండలంలో నీట మునిగిన ఇళ్లు