కృష్ణా జిల్లా తొట్లవల్లురు వద్ద కృష్ణా నది ప్రవాహం ఉద్ధృతంగా కొనసాగుతుంది. వరద నీటితో ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ పాయలు లంకగ్రామాలను ముంచెత్తున్నాయి. రహదారులు, వంతెనలు మునిగిపోవడం వలన లంకగ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. ఇప్పుడక్కడి ప్రజలకు నాటుపడవలపై ప్రయాణం దిక్కైంది. పాముల లంక ,కాట్రవాణిలంక, భైరవలంక గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని బిక్కు బిక్కుమంటు గడుపుతున్నారు. పంటలన్నీ నీట మునిగిపోయాయి. నిత్యవసరాలు అందాలంటే నాటుపడవతో ప్రయాణం చేయక తప్పడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
కృష్ణమ్మ వరద...నాటు పడవల్లోనే లంక ప్రజల ప్రయాణం - villages
ఎగువ నుంచి వస్తోన్న వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. వరదతో కృష్ణా జిల్లాలోని లంక గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు స్తంభించాయి. కనీస నిత్యవసరాలు కావాలంటే నాటుపడవతో నది దాటాల్సిందే. ప్రమాదమని తెలిసినా.. నాటుపడవల్లో ప్రయాణాలు తప్పడం లేదని ప్రజలు చెబుతున్నారు.
నాటు పడవల్లోనే లంక ప్రజల ప్రయాణాలు
ఇదీ చదవండి :