ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Krishna: వత్సవాయిలో నకిలీ పోలీసులు అరెస్టు - కృష్ణా జిల్లా సమాచారం

కృష్ణా జిల్లా వత్సవాయిలో ఓ ముఠా పోలీసులుగా చెప్పుకొంటూ వసూళ్లకు పాల్పడుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ముఠాను అరెస్టు చేశారు.

fake police
నకిలీ పోలీసుల అరెస్టు

By

Published : Jul 14, 2021, 1:41 PM IST

కృష్ణా జిల్లా వత్సవాయి మండలంలో పోలీసులుగా చలామణి అవుతూ డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు నందిగామ డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు.

కొందరి ద్వారా వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ మహా లక్ష్మణుడు, సిబ్బంది.. ముఠా సభ్యులను చాకచక్యంగా పట్టుకున్నారని డీఎస్పీ వెల్లడించారు. వారి వద్ద నుంచి ఒక కారు, 2 ద్విచక్ర వాహనాలు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వారిపై రౌడీ షీట్ నమోదు చేస్తామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details