ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా జిల్లాలో పక్కాగా 144సెక్షన్​ అమలు!

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన 144 సెక్షన్‌ను కృష్ణాజిల్లా పోలీసులు కఠినంగా అమలు పరుస్తున్నారు. సమయానికి మించి దుకాణాలు తెరిసిన యజమానులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. వీధుల వెంట తిరుగుతూ ప్రజలను బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.

krishna dst police strictly implimeting 144 section
జిల్లాలో పక్కాగా అమలు చేస్తున్న 144సెక్షన్​.

By

Published : Mar 24, 2020, 1:32 PM IST

జిల్లాలో పక్కాగా అమలు చేస్తున్న 144సెక్షన్​.

నూజివీడు

పోలీస్ దిగ్బంధంలో నూజివీడు పట్నం ఉంది. మోటార్ వాహనాలపై వెళ్లే వారిని ఇళ్లకు పంపిస్తున్నారు. వార్డు సచివాలయం వాలంటీర్లు సహకారంతో ఏ ఒక్కరిని బయటకు రానీయకుండా పకడ్బందీగా పహారా కాస్తున్నారు.

కంచికచర్ల

కృష్ణాజిల్లా కంచికచర్ల పోలీసులు 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. పట్టణంలో 10 గంటలు దాటిన తర్వాత రోడ్డుపై తిరుగుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. దుకాణదారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాహనదారులను వెనక్కి పంపుతున్నారు.

గుడివాడ

గుడివాడలో కరోనా వ్యాధి విజృంభించకుండా ఈ నెల 31వ తేదీ వరకు కృష్ణాజిల్లా గుడివాడ డివిజన్ పరిధిలో 144వ సెక్షన్ ఉన్నందువల్ల పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసర సరుకుల కోసం కొన్ని దుకాణాలు తెరవగా పది తర్వాత ఆ దుకాణాలను పోలీసులు మూసివేయించారు. రోడ్లపైకి వచ్చే ద్విచక్ర వాహనాల తాళాలు లాక్కుని వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. విజయవాడ

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విజయవాడలో పోలీసులు రహదారులు దిగ్బంధం చేస్తున్నారు. రహదారిపై వచ్చే వాహన దారులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. రామవరప్పాడు ప్రధాన కూడళ్లలో నగరంలోని వెళ్లే దారులన్నింటిని బారికేడ్లు ఏర్పాటు చేశారు.

మైలవరం

కృష్ణా జిల్లా మైలవరం పోలీసులు వెల్వడం గ్రామానికి వెళ్లే రహదారిని దిగ్బంధం చేశారు. ప్రతి ఒక్కరు విధిగా కర్ఫ్యూని పాటించాలని, లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్. ఐ ఈశ్వరరావు హెచ్చరించారు.

నందిగామ

కృష్ణా జిల్లా నందిగామలో రోడ్లని నిర్మానుశ్యంగా మారాయి. పోలీసులు రోడ్లపైకి ఎవరిని అనుమతించడం లేదు.

ఇదీ చూడండికూతురితో తండ్రికి తలకొరివి పెట్టించిన 'కరోనా'!

ABOUT THE AUTHOR

...view details