ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు పేర్కొన్నారు. నందిగామ పట్టణంలోని గాంధీ సెంటర్లో జగనన్న చేదోడు పథకం కింద లబ్ధి పొందిన నాయీబ్రాహ్మణులు, రజకులు, టైలర్స్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
'జగనన్న చేదోడు' లబ్ధిదారులతో ఎమ్మెల్యే సమావేశం - chedodu scheem taja news
జగనన్న చేదోడు పథకం లబ్దిదారులతో కృష్ణాజిల్లా నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అందించిన ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన వారి వివరాలను ఆయన తెలిపారు. అనంతరం నాయీబ్రాహ్మణులు, రజకులు, టైలర్లు ఎమ్మెల్యేకు సన్మానం చేశారు.
కులమతాలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని తెలిపారు. నందిగామ నియోజకవర్గంలో నాయీ బ్రాహ్మణులు 155 మంది, రజకులు 215 మంది, టైలర్లు 1172 మంది జగనన్న చేదోడు పథకం కింద లబ్ధి పొందారని, ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వాలంటీర్ల ద్వారా తిరిగి అప్లై చేయాలని సూచించారు.
అన్ని వర్గాలు, అన్ని రంగాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపటమే లక్ష్యంగా, బడుగు బలహీన వర్గాల ప్రజలకు చేయూతను అందించటం కోసం ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ఎమ్మెల్యేని నాయీ బ్రాహ్మణ, రజక, టైలర్ అసోసియన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.