కృష్ణా జిల్లా నందిగామ మండలం మాగల్లు సమీపంలోని పట్టాభూమిలో సరిహద్దులు దాటి ఇసుక తరలించారని పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి తీసుకున్న భూమిలో కాకుండా పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో ఇసుక తరలించారు. కాంట్రాక్టర్ గొట్టిపాటి శ్రీధర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు 23 లారీలు, 2 జేసీబీలు స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
'సరిహద్దులు దాటి ఇసుక రవాణా చేశారు' - sand rate in krishna dst nandigama
ఇసుక రవాణాకు ప్రభుత్వం కొన్ని ప్రాంతాలకు అనుమతిచ్చింది. ఈ అవకాశాన్ని కొందరు స్వార్థపరులు దుర్వనియోగం చేస్తున్నారు. అనుమతులు ఇచ్చిన సరిహద్దులు దాటి ఇసుకను తరలించారు. కృష్ణా జిల్లా నందిగామ మండలంలో మాగల్లు సమీపంలో ఈ ఘటన జరిగింది.
Krishna dst nandigama dst arrested illegal sand transporters