రేషన్ కోసం చౌక ధరల దుకాణం వద్ద ఎవరూ పడిగాపులు కాయాల్సిన అవసరం లేదని కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ మాధవీలత చెప్పారు. ఇప్పటికే అన్ని చోట్లా సరుకులు సరిపడా అందుబాటులోకి తీసుకువచ్చినట్టు స్పష్టం చేశారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా కల్పించారు. సామాజిక దూరం పాటిస్తూ రేషన్ తీసుకోవాలని కోరారు. ఆఖరి రేషన్‌కార్డు దారుడి వరకు సరుకు చేరేంతవరకూ రేషన్ పంపిణీ చేస్తామన్నారు.
'లబ్ధిదారులందరికీ రేషన్‌ను సరఫరా చేస్తాం' - live updates of corona virus in andhrapradesh
లాక్ డౌన్ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో రేషన్ పంపిణీ సక్రమంగా జరుగుతోందని జిల్లా సంయుక్త కలెక్టర్ మాధవీలత చెప్పారు. మూడు విడతల్లో పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.

కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ ఈటీవ్ భారత్‌తో ముఖాముఖి
కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ ఈటీవ్ భారత్‌తో ముఖాముఖి
ఇదీ చూడండి: