ప్రకాశం బ్యారేజీ నుంచి వరద మరింత పెరిగే ప్రమాదం ఉన్నందున కృష్ణా జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సూచించారు. పంచాయతీ రాజ్, మున్సిపల్ , పోలీసు, రెవెన్యూ సహా అధికార యంత్రాంగం అంతా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. కొవిడ్ దృష్ట్యా తగిన జాగ్రత్తలు, ప్రొటోకాల్ పాటిస్తూ రక్షణ, సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి 3లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్న దృష్ట్యా దిగువ ప్రాంతం విజయవాడలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షించారు. కృష్ణలంక, తారకరామ నగర్ , తదితర ప్రాంతాల్లో కరకట్ట వెంట పరిస్థితిని పరిశీలించి.. ముంపు ప్రాంతాల్లోని వారిని పునరావాస కేంద్రానికి తరలించారు. వరద వస్తున్నదృష్ట్యా ప్రజలు వేచి చూడకుండా పునరావాస కేంద్రానికి వెళ్లి సహకరించాలని కలెక్టర్ విజ్ణ్నప్తి చేశారు.
ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ ఇంతియాజ్ పర్యటన - rain in vijayawada
కృష్ణాజిల్లాలోని లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. ముంపు ప్రాంతాల ప్రజలంతా త్వరిగతిన సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి వరద మరింత పెరిగే ప్రమాదం ఉందని.. అధికారులకు సహకరించాలని తెలిపారు.
krishna dst collector vists inland areas in Vijayawada due to flood effect