ప్రత్యేక రైళ్లు, అంతర్జాతీయ దేశీయ విమానాల ద్వారా అనేక మంది ప్రయాణికులు జిల్లాకు వచ్చే అవకాశం ఉందని... వారందరికీ సరైన రీతిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్.. అధికారులను ఆదేశించారు.
ఈ విషయమై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్.. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైళ్లు, విమానాల ద్వారా వచ్చిన ప్రయాణికులందరి సరైన వివరాలు, స్వాబ్ సేకరించిన తరువాత వారం రోజుల పాటు క్వారంటైన్ కు పంపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
తమిళనాడు, ముంబై, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చే ప్రయాణికులకు జాగ్రత్తగా కరోనా నిర్ధరణ పరీక్షలు చేయాలన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికుల్లో 100 మందిలో కనీసం ఐదుగురి స్వాబ్ సేకరించాలన్నారు. మిగిలిన వారందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేస్తే సరిపోతుందని చెప్పారు.