ప్రభుత్వ మద్దతుతోనే పోలీసు అధికారులు రెచ్చిపోతున్నారని తెదేపా జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ హసీనా బేగం మండిపడ్డారు. రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి.. సంకెళ్లతో తీసుకెళ్లి జైల్లో పెట్టిన పోలీసులు.. సలాం కేసులో ఎందుకు ఉదాసీనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఐ, హెడ్‌కానిస్టేబుల్‌పై కంటి తుడుపు చర్యలు తీసుకున్నారని వ్యాఖ్యానించారు. సీఐ, హెడ్ కానిస్టేబుల్, డీఎస్పీలపై హత్యా నేరం కేసు పెట్టాలన్నారు. వైకాపా పాలనలో సామాన్యుడికి రక్షణ లేకుండా పోయిందని హసీనా బేగం ఆరోపించారు.
'సలాం కుటుంబం ఆత్మహత్య..ప్రభుత్వ హత్యే' - నంద్యాలలో ముస్లిం కుటుంబం ఆత్మహత్య వార్తలు
సలాం కుటుంబం ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని తెదేపా జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ హసీనా బేగం ఆరోపించారు. ముస్లిం మైనార్టీ నేతలతో కలసి తెదేపా కార్యాలయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
'సలాం కుటుంబం ఆత్మహత్య..ప్రభుత్వ హత్యే'