గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పేదల గృహ నిర్మాణ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని విజయవాడ పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు నెట్టెం రఘురాం, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ డిమాండ్ చేశారు. పెనుగంచిప్రోలులో గత ప్రభుత్వ హయాంలో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులను నేతలు కలిశారు. వారి పెండింగ్ బిల్లుల వివరాలను సేకరించారు. నిర్మించిన గృహాలను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే రానున్న సంక్రాంతికి ఆ గృహాలను లబ్ధిదారులకు దగ్గరుండి అందజేయడం జరుగుతుందని నేతలు హెచ్చరించారు. పెండింగ్ బిల్లులు విషయంలో అవసరమైతే కోర్టులకు వెళ్లి లబ్ధిదారుల తరఫున పోరాటం చేస్తామని తెదేపా నేతలు స్పష్టం చేశారు.
'గృహ నిర్మాణ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి' - ఏపీలో గృహ నిర్మాణ పెండింగ్ బిల్లులు
వైకాపా ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు పూర్తైనా గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులు ఎందుకు చెల్లించడం లేదో చెప్పాలని కృష్ణా జిల్లా తెదేపా నేతలు డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లుల విషయంలో అవసరమైతే కోర్టులకు వెళ్లి లబ్ధిదారుల తరఫున పోరాటం చేస్తామన్నారు.
'గృహ నిర్మాణ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి'