రాజధాని రైతులకు మద్దతు తెలిపేందుకు కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు నుంచి 2 బస్సుల్లో తెదేపా, ఐకాస నేతలు మందడం గ్రామానికి తరలివెళ్లారు. మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, ఐకాస నేత దూళిపాళ్ల లక్ష్మణరావు, తెదేపా మండల అధ్యక్షుడు సీతారామయ్యలు రైతులతో కలిసి మందడం బయలుదేరారు. మందడంలో కొనసాగుతున్న నిరసన కార్యక్రమాల్లో వారు పాల్గొనున్నారు.
రాజధాని రైతులకు మద్దతుగా.... - రాజధాని రైతుల ఆందోళన వార్తలు
రాజధాని రైతులకు మద్దతుగా కృష్ణా జిల్లా తెదేపా, ఐకాస నేతలు మందడం బయలుదేరారు. రెండు బస్సుల్లో కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు నుంచి బయలుదేరిన నేతలు... మందడంలోని నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు.
మందడం వెళ్తున్న కృష్ణా జిల్లా నేతలు