ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ప్రతి గింజ కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. తిరువూరు పట్టణ, మండల పరిధిలోని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. బస్తాకు 3 కిలోల తరుగుతో ధాన్యం తూకాలు వేస్తున్నారనే ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. రైతులు తమ పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ఇంఛార్జ్లు దళారులను ప్రోత్సాహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
'కొనుగోలు కేంద్రాల ద్వారా పంటను అమ్ముకోండి' - krishna district sub collector swapnil dinakar visit tiruvuru paddy purchase centres news
రైతులు తాము పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకుని మద్దతు ధర పొందాలని.. కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచించారు. తిరువూరులో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.
!['కొనుగోలు కేంద్రాల ద్వారా పంటను అమ్ముకోండి' krishna district sub collector swapnil dinakar visit tiruvuru paddy purchase centres](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6885304-80-6885304-1587479188170.jpg)
తిరువూరులో సబ్ కలెక్టర్ పర్యటన