ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ విద్యార్థుల ఆలోచన...తీసుకెళ్లింది ఖండాంతరాల వైపు! - అంతర్జాతీయ సదస్సుకు కృష్ణా జిల్లా విద్యార్థులు

ప్రతిభ ఉంటే చాలు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని నిరూపించారు ఆ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. జపాన్​లో జరిగిన సునామీ అవగాహన సదస్సులో పాల్గొని శభాష్ అనిపించుకున్నారు. 44 దేశాల తరుఫున విద్యార్థులు పాల్గొన్న ఆ సదస్సులో...కృష్ణా జిల్లా నాగాయలంక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా స్థానం సంపాదించి ప్రతిభ ఏ ఒక్కరి సొత్తు కాదని మరోసారి నిరూపించారు.

talagadadeevi students

By

Published : Oct 12, 2019, 11:45 PM IST

ఆ విద్యార్థుల ఆలోచన...తీసుకెళ్లింది ఖండాంతరాల వైపు!
కృష్ణాజిల్లా నాగాయలంక మండలం తలగడదీవి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు. పదో తరగతి చదువుతున్న బత్తుల ముఖేష్, జయంత్ వెంకట్, తోట హేమంత్, రావి వెంకట మనికంఠలు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చేసిన ప్రాజెక్టు​ అంతర్జాతీయ సదస్సుకు ఎంపికైంది. సెప్టెంబరులో జపాన్​ దేశంలో జరిగిన ప్రపంచ సునామీ అవగాహన సదస్సులో పాల్గొన్నారు.


అవగాహన కల్పించేలా ప్రాజెక్ట్​ రూపకల్పన
విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్ట్ ను... స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్​ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ వారు జపాన్​లో జరిగే సదస్సుకు ఎంపిక చేశారు. వీరి ప్రాజెక్టులో ముఖ్యంగా ప్రకృతి విపత్తులపై ప్రజలకు అవగాహన కల్పించటం, నాటకాలు ప్రదర్శిస్తూ ప్రజలను చైతన్యపరచటం వంటి అనేక అంశాలను క్రోడీకరిస్తూ ప్రాజెక్ట్​ను రూపొందించారు. తుపాన్లు, సునామీలకు గురైనప్పుడు భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరగకుండా... ఉపాధ్యాయుల సలహాలతో ఈ ప్రాజెక్ట్ రూపొందించామని విద్యార్థులు తెలిపారు.

దాతల సహకారం
జపాన్ వెళ్లే ఆర్థిక స్థోమత లేకపోవటంతో విద్యార్థులకు సాయం అందించేందుకు దాతలు ముందుకొచ్చారు. వారి సాయంతో సదస్సులో పాల్గొన్నారు. ప్రకృతి విప్తత్తులు సంభవించినప్పుడు అక్కడి ప్రజలు అవలంబిస్తున్న పద్ధతులను తెలుసుకున్నారు. అంతేకాదు తమ గ్రామంలో ఉన్న ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలాల్లో చదివే తమ బిడ్డలు జపాన్ దేశంలో జరిగిన సదస్సులో పాల్గొనటంపై తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలలలో చదివినా ఉన్నత స్థాయిలో రాణించవచ్చని... చదువుకు పేదరికం అడ్డురాదని నిరూపించారు ఈ మట్టిలో మాణిక్యాలు .

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details