Telugu student death in america: అమెరికాలో దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన తెలుగు యువకుడు చిట్టూరు సత్యకృష్ణ మృతదేహాన్ని.. స్వదేశానికి రప్పించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం సహకరించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
కృష్ణా జిల్లా కలిదిండికి చెందిన చిట్టూరి సత్యకృష్ణ ఉన్నత విద్య కోసం గత నెల అమెరికాకు వెళ్లారు. అక్కడి అలబామా రాష్ట్రంలో ఓ స్టోర్స్ దుకాణంలో ఉద్యోగంలో చేరాడు. ఆయన పనిచేస్తున్న దుకాణంలో దోపిడీ దొంగలు కాల్పులకు తెగబడ్డారు.