మచిలీపట్నం రైల్వేస్టేషన్‌ను కృష్ణా జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. యాంటీ స్మగ్లింగ్ డ్రైవ్‌లో భాగంగా ఈ దాడులు చేసినట్లు ఎస్పీ తెలిపారు. డాగ్ స్క్వాడ్ తో రైల్వేస్టేషన్ ప్రాంగణంతో పాటు సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌లో సోదాలు చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లాలో యాంటీ స్మగ్లింగ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు. అందులో భాగంగా బస్టాండ్, రైల్వేస్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ తనిఖీలు నిరంతర ప్రక్రియలా కొనసాగుతాయని ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ వెల్లడించారు.
SP RAID : మచిలీపట్నం రైల్వేస్టేషన్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు - machilipatnam railway district
మచిలీపట్నం రైల్వేస్టేషన్‌ను కృష్ణా జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆకస్మిక తనిఖీ చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లాలో యాంటీ స్మగ్లింగ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు.
మచిలీపట్నం రైల్వేస్టేషన్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు
TAGGED:
మచిలీపట్నం రైల్వేస్టేషన్