బస్సులు ఎక్కే ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడాలని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్.. ఆర్టీసీ అధికారులకు సూచించారు. లాక్ డౌన్ అనంతరం ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు బస్సులు నడుపుతున్న నేపథ్యంలో మచిలీపట్నం ఆర్టీసీ బస్టాండ్‌ను సందర్శించారు. ప్రయాణం చేసేవారు మాస్కులు ధరించేలా, శానిటైజర్‌తో చేతులు శుభ్రపరుచుకునేలా చూడాలని సిబ్బందికి సూచించారు.
విధుల్లో ఉన్న వారికి మాస్కులు, గ్లౌజులు అందజేశారు. పోలీస్ శాఖ తరఫునుంచి ఎలాంటి సహాయం అవసరమైనా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రయాణికులు తమ చేతులు శుభ్రపరచుకునేందుకు వీలుగా ఫూట్ ఆపరేట్ శానిటైజర్ ఎక్విప్మెంట్ మెషీన్‌ను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజరు.. ఎస్పీకి తెలిపారు.