ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొర్రెల కాపరులకు రాయితీ రుణాలు ఇవ్వాలి: రామకృష్ణ - vijayawada sheep breeders cooparative news

గొర్రెల కాపరులకు న్యాయం చెయ్యాలని... కృష్ణా జిల్లా గొర్రెలు, మేకల కాపరుల కోపరేటివ్ యూనియన్ బాధ్యులు రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడలోని ప్రెస్​క్లబ్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్​సీడీసీ రుణాలు రూ.2 లక్షలు... 50 శాతం రాయితీతో ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

రామకృష్ణ

By

Published : Nov 2, 2019, 8:16 PM IST

మాట్లాడుతున్న రామకృష్ణ

కృష్ణా జిల్లా గొర్రెలు, మేకల కాపరుల కోపరేటివ్ యూనియన్ బాధ్యులు రామకృష్ణ... విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ప్రమాదవశాత్తు గొర్రెలు చనిపోతే... ఎటువంటి బీమా లేకుండా రూ.6వేల పరిహారం అందజేస్తామని సీఎం ప్రకటించడం హర్షణీయమన్నారు. ఎస్​సీడీసీ రుణాలు రూ.2 లక్షలు... 50 శాతం రాయితీతో ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర బడ్జెట్​లో గొర్రెల ఫెడరేషన్​కు రూ.5వేల కోట్లు కేటాయించాలని కోరారు. గొర్రెల కాపరుల కుటుంబాల్లో పట్టభద్రులైన నిరుద్యోగులకు రూ.25 లక్షల రుణాలు మంజూరు చేసి... 50 శాతం రాయితీ ఇచ్చి ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details