ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ మంత్రులు రాణిస్తారా?

ముఖ్యమంత్రిని నిర్ణయించటంలో క్రియాశీలకమైన కృష్ణా జిల్లాలో రాజకీయాలు రూపు మార్చుకుంటున్నాయి. తెదేపాకు కంచుకోటైన కృష్ణాలో తాజా పరిస్థితులు..

మంత్రులు దేవినేని, కొల్లు రవీంద్ర (ఫైల్ ఫొటో)

By

Published : Feb 21, 2019, 5:00 AM IST

Updated : Feb 21, 2019, 9:35 AM IST

రాష్ట్ర రాజకీయాలను శాసించే కృష్ణాజిల్లాలో 16 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలున్నాయి. జిల్లాలో తెలుగుదేశం పార్టీది పైచేయిగా కనిపిస్తున్నా... చాలా చోట్ల వైకాపా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్దమైంది. కొత్తగా వచ్చిన జనసేన పార్టీ.. జిల్లాలో గెలిచే స్థాయికి చేరుకోలేకపోయినాగెలుపోటములనుశాసించే స్థాయిలో ఉంది. కాంగ్రెస్, వామపక్షాలు, భాజపాప్రభావం నామమాత్రంగా కనిపిస్తోంది.

తెలుగు దేశానికి కంచు కోటగా ఉన్న కృష్ణాజిల్లాలో.. తిరిగి అన్ని స్థానాల్లో పసుపు జెండా రెపరెపలాడించేందుకు తెదేపా ప్రయత్నిస్తుండగా.. ముగ్గురు సభ్యులున్నప్పటికీ అధికార పార్టీకి భారీగా గండి కొట్టాలనే లక్ష్యంగా వైకాపా పావులు కుదుపుతోంది. దీంతో జిల్లాలో రాజకీయం రంజుగా మారింది.

జిల్లా నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుంచి మంత్రి దేవినేని పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ నుంచి వైకాపా తరపున గతంలో జోగి రమేశ్ పోటీ చేయగా.. ఈసారి వసంత కృష్ణ ప్రసాద్ బరిలోకి దిగనున్నారు.

దేవినేని అనుకూలతలు
1. ఇప్పటికే ఒకసారి మైలవరం నుంచి గెలిచి ఉండటం
2. పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టటం, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి చేయటం
3. ప్రజలకు ఇళ్ల పట్టాల మంజూరు, రహదారుల నిర్మాణం.

ప్రతికూలతలు
1. మంత్రి పేరు చెప్పుకుని కింది స్థాయి నేతలు అవినీతి చేశారని ప్రచారం జరుగుతుండటం

మరో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ నేతలు గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నట్లు సమాచారం. అందువల్ల పవన్ లేదా ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశాలు కొట్టిపారేయలేనివి. వైకాపా తరపున గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిన మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని తిరిగి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

మంత్రికి అనుకూలం
1. 2వేల కోట్లకు పైగా నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయటం.
2. మచిలీపట్నం పోర్టు పనులను సీఎంతో ప్రారంభింపజేయటం
3. సౌమ్యుడిగా పేరుండటం, ప్రజలకు అందుబాటులో ఉండటం

ప్రతికూలం
1. పార్టీలో గ్రూపు రాజకీయాలు.

Last Updated : Feb 21, 2019, 9:35 AM IST

ABOUT THE AUTHOR

...view details