సాంకేతిక పరిజ్ఞాన సరిగ్గా వినియోగించుకోవడంలో.. కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని (Krishna police top place on using Technology) దక్కించుకోవటం సంతోషదాయకమని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఐటీ కోర్ సిబ్బందిని మరింత బలోపేతం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 40 రోజులపాటు వారికి శిక్షణనిచ్చామన్నారు. సాంకేతిక పరమైన నేరాలను చేధించి బాధితులకు న్యాయం చేయడంలో తగిన పరిజ్ఞానాన్ని అందించామన్నారు.
కేసుల పరిష్కారంలో దేశవ్యాప్తంగా 14 వేల పోలీసు స్టేషన్ల క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నామని ఎస్పీ స్పష్టం చేశారు. దీని ద్వారా నిర్ణీత సమయంలోపు చార్జిషీట్లను నమోదు చేయడంలో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వివిధ అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేసి, ప్రత్యేకంగా సత్కరించారు.