ఖమ్మం జిల్లా పర్యటనకు బయలుదేరిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పలుచోట్ల ఘనస్వాగతం లభించింది. అమరావతి పోరాటానికి మద్దతు తెలుపుతూ గొల్లపూడి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఒక వివాహానికి హాజరయ్యేందుకు వెళుతూ దారిలో మైలవరంలో ఆగిన చంద్రబాబుకు పట్టణ తెలుగుదేశం నాయకులు ఘనస్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో పార్టీ జెండాలు చేతబూని కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. ఎ.కొండూరు మండలం రామచంద్రాపురం, చీమలపాడు, కంభంపాడు, తిరువూరు మండలం కాకర్ల, లక్ష్మీపురం వద్ద పూలు చల్లుతూ చంద్రబాబుకు స్వాగతం పలికారు. కార్యకర్తలకు అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు సాగారు.
కృష్ణా జిల్లాలో చంద్రబాబుకు ఘనస్వాగతం - ఖమ్మం వెళ్తున్న చంద్రబాబుకు కృష్ణా జిల్లాలో ఘనస్వాగతం
ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబుకు పలుచోట్ల ఘనస్వాగతం లభించింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఒక వివాహానికి హాజరయ్యేందుకు వెళుతూ దారిలో మైలవరంలో ఆగిన చంద్రబాబుకు పట్టణ తెదేపా నాయకులు ఘనస్వాగతం పలికారు.
![కృష్ణా జిల్లాలో చంద్రబాబుకు ఘనస్వాగతం krishna district people welcome to chandrababu naidu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6047269-541-6047269-1581507514440.jpg)
ఖమ్మం వెళ్తున్న చంద్రబాబుకు కృష్ణా జిల్లాలో ఘనస్వాగతం
ఖమ్మం వెళ్తున్న చంద్రబాబుకు కృష్ణా జిల్లాలో ఘనస్వాగతం
ఇవీ చదవండి.. నందిగామ సబ్ జైలులో యువకులకు నారా లోకేశ్ పరామర్శ