మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం.. కసరత్తులో వేగం పెంచింది. జిల్లా పాలనాధికారి ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత, ఎస్పీ రవీంద్రనాథ్ బాబు.. ఎన్నికలు జరగనున్న మండలాధికారులతో జిల్లా పరిషత్ హలులో సమీక్ష నిర్వహించారు.
ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల్లో వసతులు, భద్రతకు సంబంధించిన విషయాలు చర్చించారు. అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో జెనరేటర్ సౌకర్యం, ఇంజినీరింగ్ అసిస్టెన్స్, మహిళా పోలీసు సిబ్బంది మోహరింపుతోపాటు.. మరిన్ని వసతులు అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయించారు.