ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ - krishna district mlc election polling updates

కృష్ణా జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు.

krishna district mlc election polling
కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

By

Published : Mar 14, 2021, 10:42 AM IST

మైలవరంలో...

మైలవరంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. స్థానిక లక్కిరెడ్డి హనిమిరెడ్డి ఉన్నతపాఠశాలలో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుందని ఎమ్మార్వో వీవీ రోహిణిదేవి తెలిపారు.

మచిలీపట్నంలో...

మచిలీపట్నంలోని సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉపాధ్యాయులు ఓటు హక్కుని వినియోగించుకునేందుకు క్యూ లైన్లలో వేచి ఉన్నారు.

గన్నవరంలో..

గన్నవరం నియోజకవర్గ పరిధిలోని బాపులపాడు, ఉంగుటూరు, గన్నవరం, విజయవాడ రూరల్ మండలాల్లో.. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉపాధ్యాయులు ఓటు హక్కుని వినియోగించుకునేందుకు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తున్నారు.

ఇదీ చదవండి:ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details