ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫీవర్ సర్వేలో తప్పులు నమోదు చేస్తున్న సిబ్బందిపై చర్యలు: జేసీ శివశంకర్ - fever survey mistakes in krishna district

ఫీవర్ సర్వేలో తప్పులు నమోదు చేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా జేసీ శివశంకర్ హెచ్చరించారు. జిల్లాలో చేపడుతున్న ఫీవర్ సర్వేలో తప్పులు చోటు చేసుకుంటున్నాయని గుర్తించిన జేసీ.. ఈ ఘటనపై వైద్యాధికారులతో చర్చించారు.

krishna district joint collector shivashankar
కృష్ణా జిల్లా జేసీ శివశంకర్

By

Published : Jun 2, 2021, 7:53 PM IST

కృష్ణా జిల్లాలో చేపడుతున్న ఫీవర్ సర్వేలో సిబ్బంది తప్పులు నమోదు చేస్తున్నట్లు జేసీ శివశంకర్ గుర్తించారు. 7 నుంచి 11వ రౌండ్ వరకు నమోదు చేసిన వివరాల్లో జ్వరం లేకున్నా ఉన్నట్లు నమోదు చేసిన అంశం తన దృష్టికి వచ్చిందని జేసీ తెలిపారు. ఈ ఘటనపై డీఎంహెచ్​వో సహా ఇతర జిల్లా వైద్య అధికారులతో మాట్లాడిన జేసీ.. సర్వేలో తప్పులు నమోదు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం కరోనా మూడో వేవ్ గురించి వైద్యాధికారులతో చర్చించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అమలుపరిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు జేసీ శివశంకర్ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details