ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అది ప్లాస్టిక్ బియ్యం కాదు.. పోషకాహారాలు గల ఫోర్టిఫైడ్‌ బియ్యం '

కృష్ణా జిల్లాలో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, వసతి గృహాలకు పంపిణీ చేస్తోన్న ఫోర్టిఫైడ్‌ బియ్యం పట్ల జేసీ మాధవీలత స్పందించారు. ఈ బియ్యం ప్లాస్టిక్ బియ్యం కాదని..., పోషకాహారం కలిగిన బియ్యమని ఆమె స్పష్టం చేశారు. తల్లితండ్రులు ఆందోళన చెందవద్దని ఆమె సూచించారు.

krishna district   joint collector conference on fortified rice
కృష్ణ జిల్లా ఉమ్మడి కలెక్టర్ ఫోర్టిఫైడ్‌ బియ్యంపై సమావేశం

By

Published : Jun 22, 2020, 7:25 PM IST

కృష్ణా జిల్లాలో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ బియ్యం పట్ల విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందడంపై సంయుక్త కలెక్టర్ మాధవీలత స్పందించారు. నీటిపై తేలియాడుతుండడంతో ప్లాస్టిక్‌ బియ్యంగా తల్లితండ్రులు కలవరపడుతున్నారు. ఈ బియ్యం ప్లాస్టిక్‌ బియ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. పౌష్టిక విలువలు కలిగిన సాధారణ బియ్యంలో వంద గింజలకు ఒక గింజ ఫోర్టిఫైడ్‌ బియ్యం కలిపి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఫోర్టిఫైడ్‌ బియ్యంలో ఇనుము, ఫోలిక్‌ యాసిడ్‌, జింక్‌, విటమిన్‌ -బిలోని 1, 2, 3, 6, 12, విటమిన్‌ ఎ ఉన్నాయన్నారు. ఈ బియ్యం వినియోగించడం ద్వారా పిల్లల్లో అనీమియా వ్యాధి రాదని, నరాల వ్యవస్థ, రక్తప్రసరణ పెరుగుదలకు, వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details