కృష్ణా జిల్లాలో మొత్తం 11,192 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. వాటిలో 246 మందికి పాజిటివ్ తేలిందని తెలిపారు. 37 మంది డిశ్ఛార్జ్ కాగా... 201 మంది వైద్యం పొందుతున్నారు. మరో వెయ్యీ 393 మంది నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. జిల్లాలో మొత్తం 34 క్వారంటైన్ కేంద్రాల్లో 621 మందిని పర్యవేక్షిస్తున్నారు. ఏప్రిల్ 24 నుంచి 30 వరకూ జిల్లాలో ఏకంగా 180 కేసులు నమోదు కాగా... గురువారం ఉదయం 10 గంటల నుంచి శుక్రవారం ఉదయం వరకూ ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కాలేదు.
జిల్లాలో మార్చి 21న తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కాగా... ఆ సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ 246కు చేరింది. ఇందులో సింహభాగం విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోనివే. ఫలితంగా నగరాన్ని అధికారులు 19 క్లస్టర్లుగా విభజించారు. ఇందులో కృష్ణలంక, కార్మికనగర్, అజిత్‌సింగ్ నగర్లలోనే... 120కిపైగా పాజిటివ్ కేసులు నిర్ధరించారు. కొందరికి వైరస్ ఎలా సోకిందో ఇప్పటివరకూ తేలకపోగా...అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు.