కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలంలోని గుడివాకవారిపాలెంలో పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతం నుంచి 200 మీటర్ల దూరాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. అవనిగడ్డ సీఐ భీమేశ్వర రవికుమార్, తహసీల్దార్ మస్తాన్, ఎంపీడీవో, మండల వైద్యాధికారిణి గ్రామంలో పర్యటించారు.
కంటైన్మెంట్ జోన్‌గా గుడివాకవారి పాలెం - కంటైన్మెంట్ జోన్‌గా గుడివాకవారి పాలెం
కృష్ణా జిల్లాలోని గుడివాకవారిపాలెంను అధికారులు కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ప్రజలెవరూ ఇళ్లనుంచి బయటకు రావొద్దని.. బయటి వ్యక్తులు ఎవరైనా గ్రామంలోకి వస్తే తమకు సమాచారమివ్వాలని సూచించారు.
కంటైన్మెంట్ జోన్‌గా గుడివాకవారి పాలెం
ప్రజలెవరూ బయట తిరగవద్దని సూచించారు. బయటి వ్యక్తులు ఎవరైనా గ్రామంలోకి వస్తే తమకు సమాచారమివ్వాలని చెప్పారు. అత్యవసర పనుల కోసమే బయటకు వెళ్లాలని.. వెళ్లేటప్పుడు మాస్కులు పెట్టుకోవాలని అన్నారు. ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
ఇవీ చదవండి... : దేవాలయాల ఆస్తులపై వైకాపా కన్ను: బుచ్చిరాం ప్రసాద్