ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మాకు కుటుంబాన్ని కలవాలని ఉంది.. సెలవులు ఇవ్వండి' - గన్నవరం క్వారంటైన్ తాజా వార్తలు

కరోనా కట్టడిలో వైద్య సిబ్బందిది కీలక పాత్ర. ఉదయం నుంచి రాత్రి వరకూ తీరిక లేకుండా విధులు నిర్వహిస్తూ.. మహమ్మారి వ్యాప్తి చెందకుండా చూస్తున్నారు ఏఎన్​ఎమ్​లు. ఇప్పటి వరకూ అలుపెరగకుండా పనిచేసిన వారు.. ఇప్పుడు తమకూ కుటుంబసభ్యులతో గడిపే సమయం ఇవ్వాలని కోరుతున్నారు.

krishna district gannavaram quarantine staff request to holidays
గన్నవరం క్వారంటైన్ కేంద్రం

By

Published : May 19, 2020, 8:15 AM IST

కృష్ణా జిల్లాలోనే అతిపెద్ద క్వారంటైన్ కేంద్రమైన గన్నవరం పశు వైద్య కళాశాలలో.. 54 రోజులుగా 3 విభాగాల్లో క్లస్టర్ సచివాలయ ఏఎన్​ఎమ్​లు సేవలందిస్తున్నారు. క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేసిన దగ్గర్నుంచి 24 మంది నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నారు.

వరుసగా 15 రోజులు విధులు నిర్వహిస్తే సెలవులు ఇస్తామని అధికారులు చెప్పారన్నారు. ఇంతవరకూ తమకు సెలవులు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కుటుంబ సభ్యులతో గడిపే సమయం దొరకడం లేదని... ఇప్పటికైనా తమకు ఆ అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details