ధాన్యం విక్రయించి మూడు నెలలు గడుస్తున్నా తమ ఖాతాలో ఒక్క రూపాయి కూడా జమ కాలేదంటూ కృష్ణా జిల్లా రెడ్డిగూడెం కొత్తనాగులురు గ్రామానికి చెందిన రైతులు వాపోతున్నారు. ప్రైవేటు వ్యక్తులకు ధాన్యం అమ్ముకున్నా ప్రభుత్వం ద్వారానే డబ్బులు వచ్చేలా చేసి అయోమయంలో పడేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రైవేటు కేంద్రానికి 212 బస్తాల ధాన్యం విక్రయించగా, 182 బస్తాలకు మాత్రమే డబ్బులు చెల్లిస్తామన్నారని, తరుగు కింద 20 బస్తాలు తీసి వేశారని నేర్సు సుబ్బారావు అనే రైతు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.