విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ నెలలో 3 ప్రత్యేక విమానాలు రానున్న క్రమంలో ఏర్పాట్లను విమానాశ్రయ అధికారులతో కలసి కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పరిశిలించారు. ప్రయాణికుల కోసం ఎర్పాటు చేసిన ప్రత్యేక టెర్మనల్ని, థర్మల్ స్క్రీనింగ్ పరీక్షల కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
- సౌదీ అరేబియా నుంచి ఈ నెల 20న రాత్రి 10.15 నిమిషాలకు ప్రయాణికులతో గన్నవరం ఎయిర్పోర్ట్కు ప్రత్యేక విమానం రానుంది.
- 23న రాత్రి 10 గంటలకు సౌది అరేబియా నుండి మరో ఎయిరిండియా ప్రత్యేక విమానం రానుంది.
- వివిధ దేశాల నుంచి దిల్లీ చేరుకున్న ప్రవాసాంధ్రులను తీసుకొని 27న ఉదయం 11:30కు గన్నవరం విమనాశ్రయానికి ఎయిరిండియా విమానం రానున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.