కృష్ణాజిల్లాలో పంటనష్టంపై కలెక్టర్ ఇంతియాజ్.. విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాథమిక అంచనాలతో నివేదిక రూపొందించారు. మొత్తం 94వేల 464 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. 34 మండలాల్లోని 326 గ్రామాల్లో అధిక వర్షాలు నమోదైనట్లు కలెక్టర్ పేర్కొన్నారు. 93వేల 876 హెక్టార్లలో వరి పంట నష్టపోయినట్లు అంచనా వేశారు. 150 హెక్టార్లలో పత్తి, 45 హెక్టార్లలో వేరుశెనగ, 49 హెక్టార్లలో మినుముకు నష్టం జరిగింది. 348 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. 21 గృహాలు, పూరి గుడిసెలకు నష్టం జరిగినట్లు గుర్తించారు.
వరద నష్టంపై అధికారులతో కలెక్టర్ ఇంతియాజ్ టెలీకాన్ఫరెన్స్ - కృష్ణా జిల్లా తాజా వార్తలు
కృష్ణాజిల్లాలో వరద నష్టంపై అధికారులతో కలెక్టర్ ఇంతియాజ్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాథమిక అంచనాలతో నివేదిక రూపొందించారు. మొత్తం 94,464 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. 348 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు.
krishna district Collector