అధికారులు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవగాహన కల్పించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సూచించారు. అవనిగడ్డ, కోడూరు మండలాల్లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కొవిడ్ నుంచి కాపాడుకోవటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు ఎప్పటికప్పడు తెలియజేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించాలని సూచించారు. సమీక్ష అనంతరం కలెక్టర్ కోడూరు సచివాలయం-1లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సచివాలయ ఉద్యోగుల పనితీరుపై ఆరా తీశారు.
కోడూరు సచివాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు - కోడూరులో కలెక్టర్ ఇంతియాజ్ వార్తలు
కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కోడూరు సచివాలయం-1లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కరోనా పట్ల అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
కోడూరు సచివాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు