కృష్ణా నదికి వరద పోటెత్తటంతో విజయవాడలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తారకరానగర్, భూపేశ్ గుప్తానగర్ ప్రాంతవాసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. పులిచింతల నుంచి విడుదల చేస్తున్న వరద నీరు శనివారం ప్రకాశం బ్యారేజీకి తాకే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శనివారం సాయంత్రం 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజీకి వస్తుందని అంచనా వేశారు. దీంతో లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్ ఇంతియాజ్.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ ఇంతియాజ్
విజయవాడ లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇంతియాజ్ సూచించారు. విజయవాడ లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్.. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
కలెక్టర్ ఇంతియాజ్